జేడీ చక్రవర్తి ‘‘చేతబడి” ఐదు భాషల ఆడియో రైట్స్ దక్కించుకున్న మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ
ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది. మరోవైపు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. M3 media, Maha Movies బ్యానర్ మీద తెరకెక్కుతుండగా...
మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ, దర్శకత్వం సూర్యాస్ కాగా
సంగీతం : అచ్చు రాజమణి - లిరిక్స్ : ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ - సినిమాటోగ్రాఫర్ : మిర్లాన్ నజీర్ - ఎడిటర్ : వంశీ - ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలల, పిఆర్‌ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్) వ్యవహరిస్తున్నారు.