ఏపీ సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్..!
ఇటీవల అల్లు అర్జున్ ఇంట్లో తన సోదరుడు అల్లు శిరీష్, నైనిక రెడ్డి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు అల్లు కుటుంబంతో పాటుగా మెగా కుటుంబ సభ్యులు పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయవేత్తలు కూడా హాజరయ్యి ఈ జంటను ఆశీర్వదించారు. తాజాగా అల్లు అర్జున్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ తన ట్విట్టర్లో ఇలా షేర్ చేస్తూ.. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు శిరీష్,నయనికాను ఆశీర్వదించడానికి, మా ఫ్యామిలీకి మీ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా ఇంటికి వ్యక్తిగతంగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చేసినందుకు మీ ఆప్యాయత ఆశీర్వాదాలకు మేము నిజంగా కృతజ్ఞతలు అయ్యాము, అయితే క్షమించండి ఆ సమయంలో నేను విదేశాలలో ఉన్నాను మీతో ఫోన్లో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.