ఐబొమ్మ రవి కేసులో ఊహించని ట్విస్ట్..ఒక్క దెబ్బతో టోటల్ ఛేంజ్ అవ్వబోతుందా..!?
దీనికి ప్రతిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు తమ వాదనలు వినిపించారు. రవికి కరేబియన్ దీవుల పౌరసత్వం ఉన్నందున, బెయిల్ మంజూరు చేస్తే విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాల పైరసీ కొనసాగుతోందని, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంలో రవి తరఫు న్యాయవాది మరోసారి స్పందిస్తూ, పిటిషనర్ పాస్‌పోర్ట్‌ను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారని, అలాంటి పరిస్థితిలో విదేశాలకు వెళ్లే అవకాశం ఎలా ఉంటుందో ప్రశ్నించారు. దర్యాప్తుకు ఆటంకం కలిగించే పరిస్థితి లేదని, చట్టపరమైన నిబంధనలు పాటించడానికి రవి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, పాస్‌పోర్ట్ స్వాధీనం అంశంపై స్పష్టమైన సమాచారం సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. సంబంధిత వివరాలు అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ కేసు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సినిమా పైరసీని అరికట్టేందుకు తీసుకుంటున్న చట్టపరమైన చర్యలు ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. హైకోర్టు తదుపరి విచారణలో వచ్చే నిర్ణయం ఈ కేసులో కీలకంగా మారే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.