బర్డర్ 2 : 6 రోజుల్లో మాస్ బీభత్సం.. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఇవే..?

Pulgam Srinivas
బర్డర్ 2 : 6 రోజుల్లో మాస్ బీభత్సం.. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఇవే..?

హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి సన్నీ డియోల్ గురుంచి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సన్నీ డియోల్ కొంత కాలం క్రితం టాలీవుడ్ మాస్ దర్శకుడు అయినటువంటి గోపిచేంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన జాట్ అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా సన్నీ డియోల్ బార్డర్ 2 అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది. ఈ సినిమాకి విడుదల అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకి ప్రస్తుతం మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబందించిన 6 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. ఈ 6 రోజుల్లోఈ సినిమాకి రోజు వారీగా మరియు మొత్తంగా వచ్చిన వసూళ్ల వివరాలను తెలియజేస్తూ ఈ మూవీ యూనిట్ వారు ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ మూవీకి 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు 32.10 కోట్ల కలెక్షన్స్ దక్కగా , 2 వ రోజు 40.59 కోట్లు, 3 వ రోజు 57.20 కోట్లు , 4 వ రోజు 63.59 , 5వ రోజు 23.31 కోట్లు , 6 వ రోజు 15.04 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. మొత్తంగా 6 రోజుల్లో ఈ సినిమాకి 231.83 కోట్ల వసూళ్లు దక్కినట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: