"నారి నారి నడుమ మురారి"కి వచ్చిన లాభాలివే.. ఆ తప్పు చేయకపోతే బాక్సాఫీస్ షేక్ అయ్యేది..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శర్వానంద్ తాజాగా నారి నారి నడుమ మురారి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంయుక్త మీనన్ , సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ... రామ్ అబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ సంవత్సరం అన్ని సంక్రాంతి సినిమాల కంటే ఈ మూవీ లేటుగా విడుదల అయింది. దానితో ఈ సినిమాకు తక్కువ థియేటర్లు దొరికాయి. ఈ సినిమాకు తక్కువ థియేటర్లలో విడుదల ఆయిన కూడా ఈ మూవీ కి అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసింది.


ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 13 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.90 కోట్లు , సీడెడ్ లో 1.26 కోట్లు , ఆంధ్ర లో 6.81 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 13 రోజుల్లో 12.97 కోట్ల షేర్ ... 23.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 13 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.01 కోట్లు , ఓవర్ సిస్ లో 3.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 13 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 17.21 కోట్ల షేర్ ... 31.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 10.25 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగిన ఈ సినిమా దాదాపు 7 కోట్ల వరకు లాభాలను అందుకుంది. ఈ సినిమా భారీ పోటీ ఉన్న సంక్రాంతి సీజన్ లో కాకుండా వేరే టైం లో విడుదల అయ్యి ఉంటే అద్భుతమైన కలెక్షన్లను వసులు చేసేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: