రామ్ చరణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్న సుకుమార్ .. ఆ స్టార్ హీరో సినిమాలో అవసరమా..?

Thota Jaya Madhuri
తెలిసి చేస్తున్నాడో, తెలియక చేస్తున్నాడో కానీ దర్శకుడు సుకుమార్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా హర్ట్ చేస్తున్నాయనే అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ పెద్ద చర్చకు దారి తీస్తోంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, మార్చి 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలనే పక్కా ప్లాన్‌తో రామ్ చరణ్ ముందుకు సాగుతున్నాడట. సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రమోషన్స్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, దర్శకుడు సుకుమార్ మాత్రం సినిమాకు సంబంధించిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్‌ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో గట్టిగానే టాక్ నడుస్తోంది.

ఈ వార్త తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. విక్రమ్ లుక్స్ పరంగా, బాడీ ఫిజిక్ పరంగా, నటనా స్థాయి పరంగా రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇచ్చే నటుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పవర్‌ఫుల్ హీరోని రామ్ చరణ్ సినిమాల్లో అన్న పాత్రలో చూపిస్తే, ఆ క్యారెక్టర్ హైలైట్ అయ్యే అవకాశం ఉందని, దాని వల్ల హీరో ఇమేజ్‌పై ప్రభావం పడుతుందనే భయం కొంతమంది ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది.“ఇంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే హీరోని ఎందుకు సినిమాలో తీసుకోవాలి?”, “ఇది రామ్ చరణ్ సినిమానా లేక మల్టీస్టారర్‌గా మారబోతుందా?” అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు కొంతమంది మెగా అభిమానులు. మరోవైపు, కొంతమంది మాత్రం విక్రమ్ లాంటి నటుడు ఉంటే సినిమాకు మరింత బలం చేకూరుతుందని, కథాపరంగా ఇది ప్లస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇలా ఒకవైపు విమర్శలు, మరోవైపు ప్రశంసల మధ్య ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ వైరల్‌గా మారింది. ఈ క్యాస్టింగ్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే కానీ అసలు నిజం ఏంటన్నది తెలిసే అవకాశం కనిపించడం లేదు. అప్పటి వరకు మాత్రం మెగా ఫ్యాన్స్ మధ్య ఈ విషయం హాట్ టాపిక్‌గా కొనసాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: