కన్నడ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి యాష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఈయన చాలా కాలం పాటు కేవలం కన్నడ సినిమాల్లో నటిస్తూ కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి సమయం లోనే ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజిఎఫ్ చాప్టర్ 1 , కేజీఎఫ్ చాప్టర్ 2 అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
ఇకపోతే కేజీఎఫ్ పార్ట్ 2 మూవీ తర్వాత ఈయన తర్వాత యాష్ నెక్స్ట్ మూవీ ని ఓకే చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. కొంత కాలం క్రితం యాష్ "టాక్సిక్" అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం మార్చి 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే ఈ మూవీ కి సంబంధించిన 90% షూటింగ్ ఇప్పటివరకు కంప్లీట్ అయినట్లు 10% షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం , ఈ సినిమాకు సంబంధించిన 10% షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఈ సినిమా మొత్తం షూటింగ్ను ఎప్పుడు కంప్లీట్ చేస్తారా ..? ఎప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మొత్తం పనులు కంప్లీట్ అవుతాయా అని యాష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.