చిరంజీవి బాబీ కాంబో మూవీ క్రేజీ అప్ డేట్ ఇదే.. సూపర్ టైటిల్ ఫిక్స్!

Reddy P Rajasekhar

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ అనగానే అందరికీ 'వాల్తేరు వీరయ్య' సినిమా క్రియేట్ చేసిన రికార్డులే గుర్తొస్తాయి. సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, మెగా అభిమానులకు పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు "కాకా" అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ వినడానికి మాస్ గా ఉండటంతో పాటు సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతుండటం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. బాబీ తన మార్కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేస్తున్నారని, ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: