మాస్ మహారాజా రవితేజ తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో డింపుల్ హయతి , ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయం అందుకుంటుంది అని , రవితేజ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వస్తాడు అని ఆయన అభిమానులు , సాధారణ ప్రేక్షకులు కూడా భావించారు. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా భారీ నష్టాలను అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ పది రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.83 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 76 లక్షలు , ఆంధ్ర లో 5.37 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.96 కోట్ల షేర్ ... 15.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
ఇక పది రోజుల్లో ఈ సినిమాకి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 68 లక్షలు , ఓవర్ సిస్ లో 1.12 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 10 రోజుల్లో ఈ సినిమాకు 10.76 కోట్ల షేర్ ... 10.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ సినిమా 9.24 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే హిట్టు స్టేటస్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకోవడం చాలా కష్టం అని ఈ మూవీ భారీ నష్టాలను అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.