"అనగనగా ఒక రాజు"కి ఇప్పటివరకు వచ్చిన లాభాలు తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎన్ని ..? ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 10.48 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 3.32 కోట్లు , ఉత్తరాంధ్ర లో 5.88 కోట్లు , ఈస్ట్ లో 3.57 కోట్లు , వెస్ట్ లో 1.92 కోట్లు , గుంటూరు లో 2.21 కోట్లు , కృష్ణ లో 1.79 కోట్లు , నెల్లూరు లో 1.19 కోట్ల కలెక్షన్లు దక్కాయి. తొమిది రోజుల్లో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 30.36 కోట్ల షేర్ ... 51.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి తొమ్మిది రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కుని 2.6 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సిస్ లో 8.128 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 41.24 కోట్ల షేర్ ... 74.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 28 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 13.24 కోట్ల లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: