ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్ తెరకెక్కించబోతున్న సందీప్ రెడ్డి వంగా .. ఫుల్ టూ ఫుల్ కాంట్రవర్షీయల్..!?

Thota Jaya Madhuri

సందీప్ రెడ్డి వంగా అనే పేరు వినగానే ప్రేక్షకులకు ఆటోమేటిగ్గా గూస్‌బంప్స్ రావడం సహజం. అర్జున్ రెడ్డి, అనిమల్ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాలు కేవలం కథలుగా కాకుండా, భావోద్వేగాలు, రా ఎమోషన్స్, నిష్కంఠకమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను కుదిపేస్తాయి. అందుకే సందీప్ రెడ్డి వంగా అంటే కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ అనేలా మారిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన స్పిరిట్ పోస్టర్ ఎలా మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ పోస్టర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.

ఇదిలా ఉండగా, ఇప్పుడు టాలీవుడ్‌లో మరో హాట్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ ప్రాజెక్టుల లిస్టులో ఒక స్టార్ హీరోయిన్ బయోపిక్ కూడా ఫిక్స్ చేశాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రత్యూష.ప్రత్యూష మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె మరణానికి సంబంధించిన నిజాలు ఏమిటన్నది ఇప్పటివరకు పూర్తిగా బయటకు రాలేదు. ఈ కేసులో పలువురు రాజకీయ నాయకుల కుమారుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ కారణంగానే ప్రత్యూష బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించినప్పటికీ, వివాదాల భయంతో చివరకు వెనకడుగు వేశారు.

కానీ సందీప్ రెడ్డి వంగా అలా కాదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగానే, ఎలాంటి భయాలు లేకుండా తెరపై చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన ధైర్యం ఉంది. ఇదే కారణంగా చాలా మంది అభిమానులు, సినీ విశ్లేషకులు కూడా “ప్రత్యూష బయోపిక్‌ను సందీప్ రెడ్డి వంగా చేస్తేనే న్యాయం జరుగుతుంది” అంటూ సోషల్ మీడియాలో సూచనలు చేశారు.ఆ ఫ్యాన్స్ ఆశలే ఇప్పుడు నిజం కాబోతున్నాయా అనే చర్చ మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం, సందీప్ రెడ్డి వంగా నిజంగానే ఈ బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇది నిజమైతే, మరోసారి ఫుల్ కాంట్రవర్షీయల్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని, ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసే సినిమా ఇవ్వబోతున్నాడన్న మాట.మరి ఈ బయోపిక్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో, ఇందులో నిజాలను ఎంతవరకు బయటపెడతారో చూడాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మాత్రం, ఇది టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: