రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ఈ లెక్కలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!
కన్నడ చలనచిత్ర పరిశ్రమ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రిషబ్ శెట్టి గురించి నేడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'కాంతార' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి,. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి తన తదుపరి సినిమాల కోసం డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం, రిషబ్ శెట్టి ఒక్కో సినిమాకు ఏకంగా 80 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. 'కాంతార' ఘనవిజయంతో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా ఆయనకున్న ప్రతిభను గుర్తించిన నిర్మాతలు, ఆయన అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రిషబ్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు అగ్ర నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి.
రిషబ్ శెట్టి ఇప్పటికే తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు సమాచారం. అందులో ఒక సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతుండగా, మరో సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఒక పీరియడ్ డ్రామాను ఇప్పటికే ప్రకటించింది. ఈ రెండు సినిమాలకు గాను రిషబ్ శెట్టికి చెరో 80 కోట్ల రూపాయల పారితోషికం అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక ప్రాంతీయ నటుడు టాలీవుడ్‌లో ఈ స్థాయి పారితోషికం అందుకోవడం విశేషం. కేవలం రెమ్యునరేషన్ పరంగానే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఈ సినిమాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. 'కాంతార' సిరీస్‌తో పాటు ప్రశాంత్ వర్మ సినిమా 'జై హనుమాన్'లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో రిషబ్ శెట్టి భారతీయ సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరిపోయారు. రిషబ్ శెట్టి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.