బుక్ మై షో లో రాజా సాబ్ బీభత్సం.. 24 గంటల్లో అన్ని టికెట్స్ సేల్..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాజా సాబ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా నిన్న అనగా జనవరి 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 8 వ తేదీన పెద్ద ఎత్తున చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... నిధి అగర్వాల్ , మాలవిక మోహన్ , రీద్ధి కుమార్ లు ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు బుక్ మై షో లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.


ఈ మూవీ కి ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో సూపర్ సాలిడ్ సేల్స్ జరిగాయి. ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో ఆఖరి 24 గంటల్లో 617.75 కే సెల్ అయ్యాయి. ఈ విషయాన్ని బుక్ మై షో ప్లాట్ ఫామ్ వారు అధికారికంగా ప్రకటించారు. కేవలం బుక్ మై షో ఫ్లాట్ ఫామ్ లోనే ఈ మూవీ కి ఆఖరి 24 గంటల్లో 617.75 కే టికెట్లు సేల్ అయ్యాయి అంటే ఈ మూవీ కి మొదటి రోజు బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమాకు రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లు దక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: