కృష్ణ చేసిన పని వల్ల మహేష్ కు ఆ బ్లాక్‌బస్టర్ దూరం..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు అయినటువంటి మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం కృష్ణ చేసిన ఒక పని వల్ల మహేష్ బాబు కు భారీ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందట. ఆ సినిమా ఏది ..? ఎలా మిస్ అయింది అని వివరాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం ఎస్ వి కృష్ణా రెడ్డి దర్శకత్వంలో యమలీల అనే సినిమా రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో ఆలీ హీరోగా నటించగా ... ఇంద్రజ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఎస్ వి కృష్ణా రెడ్డి "యమలీల" కథ ను తయారు చేసుకున్న తర్వాత మొదట ఆ మూవీ లో ఆలీ ని కాకుండా మహేష్ బాబు ని హీరో గా తీసుకోవాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా కృష్ణ గారిని కలిసి ఆ మూవీ కథను చెప్పి ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తే బాగుంటుంది అని కృష్ణ గారిని అడిగాడట. దానితో కృష్ణ గారు ప్రస్తుతం మహేష్ బాబు చాలా చిన్న వాడు. చదువుపై దృష్టి పెట్టాడు. ఈ సమయంలో ఏకంగా హీరోగా నటిస్తే చదువు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి కొంత కాలం లో ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఆయన సినిమాల్లో హీరోగా నటించాడు అని చెప్పాడట. దానితో krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కృష్ణ రెడ్డి ఆ తర్వాత యమలీల కథలో ఆలీ ని హీరోగా తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాడట. ఇక అలా మహేష్ బాబు తో చేయాలి అనుకున్న సినిమాను ఎస్ వి కృష్ణా రెడ్డి , ఆలీ తో చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: