మన శంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రివ్యూ.. మెగాస్టార్ అదరగొట్టాడుగా!

Reddy P Rajasekhar

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ డైలాగ్స్, మెగాస్టార్ వింటేజ్ మేనరిజమ్స్ కలగలిసి ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, రా ఏజెంట్ మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా చిరంజీవి వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కేవలం స్టైలిష్ లుక్స్‌తోనే కాకుండా, తనదైన బాడీ లాంగ్వేజ్‌తో మెగాస్టార్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

ఈ ట్రైలర్‌లో చిరంజీవి మార్క్ మాస్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుండగా, నయనతారతో ఆయన కెమిస్ట్రీ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తోంది. సీరియస్ ఏజెంట్‌గా ఉంటూనే చిరంజీవి పండించే హ్యూమర్ అనిల్ రావిపూడి మార్క్‌ను గుర్తుచేస్తోంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కీలక మిషన్లలో ఆయన పాల్గొనే సన్నివేశాలు సినిమాలోని యాక్షన్ డోస్‌ను అద్దం పడుతున్నాయి. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఫైట్స్, క్లాస్ ప్రేక్షకులకు నచ్చే స్టైల్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఈ ట్రైలర్‌కే అతిపెద్ద హైలైట్ అని చెప్పదగ్గ విషయం విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ. చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే సంభాషణలు మరియు వారిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో నవ్వులు పూయించడమే కాకుండా అభిమానులకు కన్నుల పండువగా ఉండబోతోంది. వీరిద్దరి మధ్య కుదిరిన కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మాస్, క్లాస్, కామెడీ, టైమింగ్ మరియు గ్రేస్.. ఇవన్నీ కలిస్తేనే మెగాస్టార్ అని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

ట్రైలర్ చూసిన అభిమానులు "ఈ సంక్రాంతికి వింటేజ్ బాస్ వస్తున్నాడు, బాక్సాఫీస్ వద్ద ఒక్క రికార్డ్ కూడా మిగలదు" అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. పాత చిరంజీవిని మళ్ళీ చూస్తున్నామన్న ఆనందం వారి కామెంట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ పండగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: