నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కొంత కాలం క్రితం తమిళ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ "జన నాయగన్" అనే సినిమాను మొదలు పెట్టాడు.
ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మమతా బైజు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా భగవంత్ కేసరి మూవీ కి రీమేక్ అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. కానీ జన నాయగన్ మూవీ యూనిట్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. జన నాయగన్ మూవీ ని జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ద్వారా ఈ సినిమా భగవంత్ కేసరి మూవీ కీ రీమేక్ అని క్లియర్గా అర్థం అవుతుంది. ఈ మూవీ భగవంత్ కేసరి మూవీ కి రీమిక్ అని అర్థం అయినా కూడా భగవంత్ కేసరి మూవీలతో పోలిస్తే కొన్ని విషయాల్లో జన నాయగన్ మూవీ తేలిపోయింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.
భగవంత్ కేసరి మూవీ లో బాలయ్య వయస్సు , ఆయన లుక్ , అనిల్ రావిపూడి టేకింగ్ , తమన్ మ్యూజిక్ ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఆ విషయాలలో జన నాయగన్ మూవీ కాస్త తగ్గింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. భగవంత్ కేసరి మూవీ తో పోలిస్తే జన నాయగన్ మూవీ బడ్జెట్ ఎక్కువే అయినా కూడా ఎందుకో ఈ మూవీ ట్రైలర్ను బట్టి చూస్తే భగవంత్ కేసరి మూవీతో పోలిస్తే జన నాయగన్ కొన్ని విషయాలలో తగ్గిపోయింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.