ఓటీటీలోకి అఖండ 2 డేట్ ఫిక్స్..ఎప్పుడు? ఎందులో అంటే..?

Divya
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం అఖండ 2. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన విడుదలయ్యింది. ఇందులో బాలయ్య యాక్టింగ్, డైలాగ్స్, సనాతన ధర్మం గురించి చూపించిన అంశాలన్నీ కూడా ఆకట్టుకున్నాయనే విధంగా వినిపించాయి. సంయుక్త మీనన్, పూర్ణ, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితర నటి నటులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా రూ .100 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు వినిపిస్తున్నాయి.



 అలాంటి ఆఖండ 2 సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ అయితే వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక ఓటీటిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో స్ట్రిమింగ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


బాలకృష్ణ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశారని చెప్పవచ్చు. అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు. బాలయ్యకు మాత్రమే సాధ్యమయ్యేలా యాక్షన్స్ సన్నివేశాలలో  నటించారు. సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. థియేటర్లలో విధ్వంసం సృష్టించిన అఖండ 2, మరి ఓటీటిలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. బాలయ్య తదుపరి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తదుపరి సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఒక హిస్టారికల్ సినిమా కథ అన్నట్టుగా సమాచారం. త్వరలోనే నటీనటులకు సంబంధించి అన్ని విషయాలను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: