రామ్ కిరణ్ , మెగా ఆకాష్ ప్రధాన పాత్రలో రూపొందిన సఃకుటుంబానాం సినిమా ఈ సంవత్సరం జనవరి 1 వ తేదీన విడుదల అయింది. రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , శుభలేఖ సుధాకర్ , సత్య తదితరులు ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు. హెచ్ మహాదేవ్ గౌడ్ & హెచ్ నాగరత్న ఈ మూవీ ని నిర్మించగా ... మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మధు దాసరి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా ... శశాంక్ మాలి, శివ శర్వాణి ఈ మూవీ కి ఎడిటర్లుగా పని చేశారు.
సఃకుటుంబానాం సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై మంచి బజ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి పాత్రలో ఈ మూవీలో కళ్యాణ్ (రామ్ కిరణ్) కనిపించాడు. ఈ మూవీలో కళ్యాణ్ (రామ్ కిరణ్) ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. అదే కంపెనీలో చేరిన సిరి(మేఘా ఆకాష్) కూడా జాయిన్ అవుతుంది. ఇక తనకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనే ఉద్దేశం ఉండటంతో కళ్యాణ్ (రామ్ కిరణ్) తో ప్రేమలో పడుతుంది. ఇక వీరి ప్రేమ మంచి స్థాయికి చేరిన తర్వాత కళ్యాణ్ (రామ్ కిరణ్) ఫ్యామిలీకి సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. దానితో వీరిద్దరి ప్రేమ ఏమయింది ..? అనే సస్పెన్స్ తో సినిమా ముందుకు సాగుతుంది. ఇక ఈ మూవీ దర్శకుడు కుటుంబ కథ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకుల్ని అలరించాలి అనే ఉద్దేశంతో తీసుకున్న కథ బాగానే ఉన్నా అది పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎక్కడో విఫలం అవుతుంది. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఈ మూవీ కి సంబంధించిన వరకు సాంకేతిక విభాగాల్లో కూడా అందరు బాగానే పని చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ మూవీ కథ బాగానే ఉన్నా పూర్తి స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త విఫలం అవుతుంది. కానీ మరి పూర్తి స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులకు విసుకు పొట్టేలా చేయదు. దానితో ఈ మూవీ ద్వారా ప్రేక్షకులు కాస్త ఎంటర్టైన్ పొందే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.