వెంకటేశ్ తరుణ్ భాస్కర్ మూవీ అప్ డేట్ ఇదే.. అప్పటివరకు మూవీ లేనట్టే!
స్టార్ హీరో వెంకటేశ్ ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత బిజీ దశలో ఉన్నారు. ఒకవైపు శంకర వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తూనే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి సమయంలోనే వెంకటేశ్ – తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌పై కూడా ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయినప్పటికీ ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లకపోవడం చర్చకు దారి తీసింది. తాజాగా ఈ ఆలస్యంపై తరుణ్ భాస్కర్ తనదైన స్టైల్‌లో స్పష్టత ఇచ్చారు.
సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా అంటే సురేష్ బాబు స్క్రిప్ట్‌ను అతి జాగ్రత్తగా ఎన్నో కోణాల్లో పరిశీలించి మాత్రమే ముందుకు తీసుకెళ్తారని అందరూ అనుకుంటుంటారని ఆయన అన్నారు. కానీ వెంకటేశ్ సినిమా విషయంలో ఆలస్యం సురేష్ బాబు వల్ల కాదు, పూర్తిగా తన వల్లే అవుతోందని తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. సురేష్ బాబు ఆలస్యం చేస్తారని అనుకుంటే తనది ఇంకా ఎక్కువ ఆలస్యం అని, తనకు బద్ధకం కూడా ఎక్కువేనని సరదాగా వ్యాఖ్యానించారు. స్క్రిప్ట్‌పై సంపూర్ణమైన సంతృప్తి వచ్చిన తర్వాతే సినిమా మొదలుపెట్టాలనే తన స్వభావమే ఈ ఆలస్యానికి కారణమని వివరించారు.
వెంకటేశ్ వంటి అనుభవం ఉన్న స్టార్ హీరోతో సినిమా చేయాలంటే కథ బలంగా ఉండాలని, ప్రేక్షకులకు పూర్తిగా కొత్త ఫీల్ ఇవ్వగలిగే కథతోనే ముందుకు రావాలని తరుణ్ భాస్కర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.. అందుకే తొందరపడకుండా తీరికగా కథపై పని చేస్తున్నట్లు సమాచారం. అన్ని విషయాలు కుదిరితే ఈ ప్రాజెక్ట్ తప్పకుండా సెట్స్‌పైకి వెళ్తుందని, వెంకటేశ్ అభిమానులు కాస్త ఓపికగా వేచి చూడాలని చెప్పవచ్చు . ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే పూర్తిగా డిఫరెంట్ ట్రీట్‌గా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో విక్టరీ వెంకటేశ్ పారితోషికం కూడా భారీ స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.