"యస్..విజయ్ నే పెళ్లి చేసుకుంటున్న..కానీ"..మ్యారేజ్ విషయంలో షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన రష్మిక..!
అయితే ఇప్పటి వరకు ఈ జంట ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రేమ కథ నిజమేనా? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అన్న ప్రశ్నలు అందరి మనసులో తచ్చాడుతున్నాయి.ఇక తాజా సమాచారం ప్రకారం, రష్మిక–విజయ్‌ల వివాహం 2026 ఫిబ్రవరి 26న జరగనున్నట్లు టాక్. పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఒక రాయల్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరుగనుందట. ఇది పూర్తిగా డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉండబోతోందని, దక్షిణ భారతీయ సంప్రదాయాలు మరియు రాజస్థానీ సంస్కృతిని మిళితం చేస్తూ అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి వేడుకలో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పాల్గొనబోతున్నారని కూడా సమాచారం.
ఇంతలో తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రష్మిక మందన్నా, తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌గా స్పందించింది. “డేట్ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు?” — అని అడగ్గా రష్మిక చాలా సంతోషంగా స్పందిస్తూ ఇలా చెప్పింది:“డేట్ చేస్తే నేను యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో చేస్తాను. ఎందుకంటే నాకు ఆ పాత్ర చాలా ఇష్టం, చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం కచ్చితంగా విజయ్ దేవరకొండనే చేసుకుంటా. నా విషయంలో మీరు అనుకుంటున్నది నిజమే. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను స్పష్టంగా ప్రకటిస్తాను.” అంటూ చెప్పింది. కానీ పెళ్లి డేట్ మాత్రం రివీల్ చేయలేదు.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియా మళ్లీ హీటెక్కిపోయింది. అభిమానులు ఆనందంతో కామెంట్లు చేస్తూ,“ఇదే మేము వినాలనుకున్నది!”..“సంతోషంగా ఉండండి రష్మిక–విజయ్ జంట!”అంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంటపై సోషల్ మీడియాలో హడావిడి మళ్లీ పెరిగిపోయింది. ఇండస్ట్రీలోనూ, ఫ్యాన్స్ వర్గాల్లోనూ ఒక్క మాటే వినిపిస్తోంది — “విజయ్–రష్మిక వెడ్డింగ్ ఆన్ కార్డ్స్!”