టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగార్జున ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరో గా నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా ఇప్పటికి కూడా అదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇక అంతా బాగానే ఉన్నా నాగార్జున చేస్తున్న ఒక పని వల్ల ఆయన ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అది ఇందులో అనుకుంటున్నారా ..? నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాలో హీరో గా నటించడం కంటే కూడా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలలో , విలన్ పాత్రలలో నటించడానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నాడు.
అందులో భాగంగా కొంత కాలం క్రితమే బ్రహ్మాస్త్ర , కుబేర సినిమాలలో కీలక పాత్రలలో నటించగా ... నాగార్జున తాజాగా కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇలా నాగార్జున చాలా మంది ఇతర హీరోల సినిమాల్లో నటిస్తూ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది. మా హీరో ఎంతో గొప్ప వాడు. ఎలాంటి ఈగో లేకుండా ఏ హీరో సినిమాలో అయినా నటిస్తున్నాడు అని వారు చాలా ఆనంద పడుతున్నారు. కానీ నాగార్జున కేవలం వేరే హీరోల సినిమాల్లో నటిస్తూ తాను మాత్రం హీరోగా సినిమాలు చేయడం లేదు.
దానితో నాగార్జున ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున హీరో గా ఆఖరుగా నా సామి రంగ సినిమా చేశాడు. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఆ తర్వాత నాగార్జున ఏ మూవీ లో హీరో గా నటించలేదు. ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. దానితో నాగార్జున అభిమానులు నాగార్జున చేస్తున్న పనికి కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది.