షాక్: చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్న టాలీవుడ్ బ్యూటీ..!

Divya
హీరోయిన్ రుక్మిణి వసంత్ సప్త సాగరదాచే ఎల్లో సైడ్ A, B వంటి చిత్రాలతో ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది. ఆ తర్వాత హీరో నిఖిల్ నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కాంతారా చాప్టర్ 1 చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజీతోనే ప్రస్తుతం ఎన్టీఆర్ తో నటిస్తున్న డ్రాగన్ సినిమాతో పాటు, హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.



నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది రుక్మిణి వసంత్. తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఒక ట్విట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అతనిపై చర్యలు తీసుకుంటానంటూ ఒక పోస్టును షేర్ చేసింది. ఎంతో మంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రుక్మిణి పేరుతో కొన్ని మోసాలు చేస్తున్నారని ఈ విషయం తనదాక రావడంతో ఇలాంటి విషయాలపైన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. 944589373 ఈ నెంబర్ ని ఉపయోగిస్తూ ఒక వ్యక్తి అచ్చం నాలాగే మాట్లాడుతూ ఇతరులను సంప్రదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.


ఈ నెంబర్ నాది కాదని నేను అందరికీ స్పష్టంగా చెబుతున్నాను ఈ నెంబర్ నుంచి ఎవరైనా ఫోన్ లేదా మెసేజ్ వస్తే ఎవరు స్పందించకండి. ఈ నెంబర్ ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తాను సైబర్ క్రైమ్ కూడా ఆశ్రయించానని తెలిపింది. ఈ నెంబర్ నుంచి ఎవరైనా ఫోన్ చేసిన ,మెసేజ్ చేసిన మీరు నేరుగా నన్ను లేదా నా టీమ్ ని సంప్రదించవచ్చు అంటూ తెలియజేసింది. ఇలాంటి మోసాలకు ఎవరు గురికాకుండా ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది రుక్మిణి వసంత్. అయితే ఈ విషయం విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: