అట్లీ తరువాత బన్నీ వర్క్ చేయబోయేది ఆ డైరెక్టర్ తోనే .. మెంటల్ ఎక్కించే కాంబో రా ఇది..!
అయితే, ఈ సినిమా తరువ్వత బన్నీ ఏ దర్శకుడితో, ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అందులో ముఖ్యంగా ఒక వార్త మాత్రం ప్రస్తుతం హీట్ పెంచేస్తోంది. ఆ వార్త ప్రకారం, బన్నీ తన తదుపరి సినిమాను బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో చేయబోతున్నాడట! ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.“సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో బన్నీ సినిమా?” అని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకూ ఆ లెవెల్ డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం రాలేదు. కానీ బన్నీకి ఆ ఛాన్స్ రావడం అభిమానుల్లో గర్వభావాన్ని కలిగిస్తోంది. “ఇది నిజమైతే దక్షిణ భారత సినీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు ఎప్పుడూ గ్రాండీయూర్, సౌందర్యం, ఎమోషన్‌తో నిండిపోతుంటాయి. ఆయన రూపొందించే ప్రతి సినిమా ఒక విజువల్ ప్యాలెస్‌లా ఉంటుంది. అలాంటి దర్శకుడి దృష్టిలో బన్నీ చేరడం నిజంగా ఒక మైలురాయి అవుతుంది. “భన్సాలీ మేజిక్‌కి బన్నీ స్టైల్ కలిస్తే స్క్రీన్‌పై మిరాకిల్ జరుగుతుంది” అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. బన్నీ అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ ప్రారంభించారు. “ఇది నిజమైతే గర్వపడే రోజు దగ్గర్లోనే ఉంది” అని వారు అంటున్నారు.