తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటి మనులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ నాగ శౌర్య హీరో గా వెంకి కుడుమల దర్శకత్వంలో రూపొందిన ఛలో అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన విజయం దక్కింది. అలాగే ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో రష్మిక కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమె చాలా వేగంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇప్పటికి కూడా ఈమె అదే రేంజ్ లో కెరీర్ను ముందుకు సాగిస్తుంది. సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకొని అలా అనేక సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించిన వారు కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి నటిగా మరింత గుర్తింపును సంపాదించుకోవాలి అని భావిస్తూ ఉంటారు.
అందులో భాగంగా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ లేడీ ఓరియంటల్ సినిమాలలో నటించి సూపర్ గా సక్సెస్ అయిన వారు కూడా అయ్యారు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న రష్మిక కూడా ఇదే రూట్లోకి వెళుతుంది. ఇప్పటికే ఈమె ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ఆ సినిమా రేపు అనగా నవంబర్ 7 వ తేదీన విడుదల కానుంది. అలాగే రష్మిక ప్రస్తుతం మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు గనుక మంచి విజయాలను సాధించినట్లయితే రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోతుంది అని చాలామంది భావిస్తున్నారు. అదే గాని జరిగితే ఈ ముద్దుగుమ్మ చాలా మంది స్టార్ హీరోయిన్లకు పోటీ అయ్యే అవకాశం ఉంది అని కూడా అనేక మంది భావిస్తున్నారు.