ప్రేమలో పడిన న్యూ జనరేషన్ స్టార్ జంట.. టాలీవుడ్‌లో న్యూ రొమాన్స్..!

Thota Jaya Madhuri
ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్తేమీ కావు. ఈ తరహా రియల్ లైఫ్ డ్రామాలు ఎప్పటికప్పుడూ టాలీవుడ్ వేదికగా సాగుతూనే ఉంటాయి. కానీ, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త లవ్ స్టోరీ ఒక్కటుంది. యంగ్ హీరో – హీరోయిన్ మధ్య మొలకెత్తిన ఈ ప్రేమ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సినిమా షూటింగ్‌లో కలిసి పనిచేస్తూ మొదలైన ఈ అనుబంధం క్రమంగా స్నేహం దాటిపోయి ప్రేమగా మారిందని ఫిల్మ్ నగర్ టాక్. మొదట వీళ్లిద్దరూ కేవలం ప్రొఫెషనల్‌గా మాత్రమే కలుస్తున్నారని అనుకున్నారు. కానీ కొన్ని రోజులుగా సెట్స్‌లో, అవుట్‌డోర్ షూటింగ్‌లలో వీరి క్లోజ్ మోమెంట్స్ చూసినవారందరూ “ఇదేం కెమిస్ట్రీ రా బాబు!” అని ఫీలయ్యేంతగా బంధం పెరిగిందట. ఇతడు టాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి చేరుకున్న యంగ్ హీరో. వరుస హిట్స్‌తో క్రేజ్‌లో ఉన్నాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరోవైపు హీరోయిన్ మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్‌హీరోయిన్స్ జాబితాలోకి చేరుతున్న అందాల భామ. స్క్రీన్ మీద కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా సెట్ అయ్యిందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.



శూటింగ్ గ్యాప్‌లలో వీళ్లిద్దరూ ఒకరి కార్ వ్యాన్ లోకి ఒకరు వెళ్తూ సీక్రెట్‌గా మీటింగ్స్ చేసుకుంటున్నారని సెట్స్‌లో ఉన్న వాళ్లు చెబుతున్నారు. మేకప్ రూమ్‌లో ఎక్కువసేపు మాట్లాడటం, షూటింగ్ పూర్తయ్యాక కూడా గంటల తరబడి కలిసి టైమ్ గడపడం ఇప్పుడు యూనిట్‌లో కామన్ టాపిక్ అయిపోయింది.ప్రస్తుతం వీరు కలిసి నటిస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. డైరెక్టర్‌కి వీళ్ల మధ్య ఉన్న న్యాచురల్ కెమిస్ట్రీ చాలా బాగా నచ్చిందట. అందుకే కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసి మరింత రొమాంటిక్‌గా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఇక ఇండస్ట్రీలోని సన్నిహితులు చెబుతున్నదేమిటంటే – “ఇది కేవలం షూటింగ్ టైమ్‌లో వచ్చే ఫ్రెండ్‌షిప్ కాదు. వీళ్లిద్దరూ నిజంగానే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు” అని. మరి ఈ ప్రేమ కేవలం గాలివార్తేనా? లేక నిజంగానే టాలీవుడ్‌లో మరో స్టార్ జంట జన్మిస్తుందా అన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.ప్ర స్తుతం ఈ ఇద్దరూ తమ ప్రేమ విషయమై ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. మీడియా అడిగితే ‘మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే’ అని సమాధానం ఇస్తున్నారు. కానీ, వీరి ప్రవర్తన చూస్తే మాత్రం అది కేవలం ఫ్రెండ్‌షిప్‌ కాదనే భావన చాలామందిలో కలుగుతోంది.



ఇక అభిమానులు మాత్రం ఈ లవ్ బర్డ్స్‌కి ఇప్పటికే ఫ్యాన్‌పేజీలు సృష్టించి “నెక్స్ట్ పవర్ కపుల్ ఆఫ్ టాలీవుడ్” అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. నిజంగా వీరి ప్రేమ బలంగా నిలబడి, పెళ్లి బంధంలోకి దారి తీస్తుందా? లేక ఇది కూడా ఇండస్ట్రీలోని మరో తాత్కాలిక రూమరేనా? సమయం మాత్రమే చెప్పాలి! మొత్తానికి — టాలీవుడ్‌లో కొత్త ప్రేమ జంట ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వీళ్ల గురించే చర్చ!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: