స్పిరిట్ నుంచి ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్.. ప్రభాస్ డైలాగ్ వైరల్..!
వీలైనంత త్వరగా స్పిరిట్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ వంగా. ఇందులో ప్రభాస్ మొదటిసారి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. నిన్నటి రోజున ప్రభాస్ బర్తడే సందర్భంగా స్పిరిట్ సినిమా నుంచి ఒక అదిరిపోయే గిఫ్ట్ అభిమానులకు అందించారు మేకర్స్. ఈ చిత్రంలో రెబల్ స్టార్ పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఆడియో రూపంలో పాటుగా గ్లింప్స్ టైపులో చిన్న వీడియోని విడుదల చేశారు.ఆడియో విషయానికి వస్తే మొదట పోలీస్ సైరెన్ తో మొదలై.. ఎవడ్రా వీడు చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది. ఆ తర్వాత ప్రకాష్ రాజు వాయిస్ తో ఎంట్రీ ఇవ్వడం మరింత హైలెట్ గా కనిపిస్తోంది. అయితే చివరిలో ప్రభాస్ మాత్రం తనకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉందనే చెప్పే డైలాగ్ హైలైట్ గా ఉన్నది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి నటిస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించబోతున్నారు. ప్రభాస్ అభిమానులకు బర్తడే కానుకగా అదిరిపోయే గిఫ్ట్ అయితే ఇచ్చినట్టుగా కనిపిస్తోంది సందీప్ రెడ్డి వంగ. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టి సురేష్ బ్యానర్ పైన సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఆడియో వైరల్ గా మారింది.