రుక్మిణి వసంత్ కాదు శ్రీలీల కాదు రష్మికకి కరెక్ట్ మొగుడు ఈ బ్యూటీనే..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా అభిమానుల మధ్య ఓ డిస్కషన్ బాగా హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే — రుక్మిణి వసంత్ వర్సెస్ రష్మిక మందన్నా. ఈ ఇద్దరు కన్నడ బ్యూటీలు ఇప్పుడు కేవలం తమ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా, సౌత్ సినిమా మొత్తంలోనే ఫ్యాన్స్ మధ్య గట్టి పోటీ సృష్టిస్తున్నారు. ఇటీవల రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది అని టాక్ బయటకి వచ్చిన తరువాత “ఇక ఆమెకి సినిమాల మీద పూర్తి ఫోకస్ ఉండదు, మ్యారేజ్ తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి” అంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. దాంతో చాలామంది, “రష్మిక నేషనల్ క్రష్‌గా ఉన్న రోజులు ఇప్పుడు ముగిసినట్టే” అని కూడా రియాక్ట్ అయ్యారు.



ఇంతలోనే రుక్మిణి వసంత్ పేరు మరోసారి బాగా ట్రెండ్ అయ్యింది. “ఇక నెక్ట్స్ నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్ అవుతుంది” అంటూ ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. అంతేకాక, శ్రీలీల కూడా ఈ లిస్ట్‌లో ఎప్పుడూ ఉండే పేరే. “రష్మిక తర్వాత శ్రీలీలే నంబర్ వన్ అవుతుంది” అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.కానీ ఈ హాట్ చర్చ మధ్యలోకి ఇప్పుడు ఇంకో పేరే ఎంట్రీ ఇచ్చింది — భాగ్యశ్రీ బోర్సే. అవును… సోషల్ మీడియాలో ఇప్పుడు రుక్మిణి వసంత్ కాదు, శ్రీలీల కాదు, రష్మికకి కరెక్ట్‌గా సరిపోయే లెవెల్ ఉన్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మాత్రమే అని ఫ్యాన్స్ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె గ్లామర్, స్మార్ట్ లుక్స్, బ్యూటీ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవరికైనా షాక్ అవుతాతు. ఇండస్ట్రీలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఇటీవలి కాలంలో చాలా వేగంగా ట్రెండ్ అవుతోంది. ఆమె నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కాకపోయినా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, ఫ్యాషన్ సెన్స్ వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమా క్రిటిక్స్ కూడా చెబుతున్నారు — “ఇంకొన్ని సినిమాల్లో భాగ్యశ్రీకి సరైన స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే, ఆమె రష్మికను కూడా మించిపోతుంది. ఆమెకు నేషనల్ క్రష్ ట్యాగ్ రావడం కన్ ఫామ్” అంటున్నారు.



ఇక సోషల్ మీడియాలో అయితే ఇంకా ఘాటుగా కామెంట్లు వస్తున్నాయి . “రష్మికకు సరిపోయే మొగుడు భాగ్యశ్రీ బోర్సే లాంటి బ్యూటీ మాత్రమే అవుతుందంట” “ఆమె ఎనర్జీ, చార్మ్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ రష్మిక రేంజ్‌లోనే ఉన్నాయి” అంటూ ఫ్యాన్స్  కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ టాపిక్ ఒక్క కన్నడ, తెలుగు ఇండస్ట్రీలోనే కాదు… పాన్-ఇండియా స్థాయిలో కూడా హాట్ హాట్‌గా సాగుతోంది. మొత్తానికి చెప్పాలంటే .. రుక్మిణి వసంత్ కాదు, శ్రీలీల కాదు… రష్మిక మందన్నాకి కరెక్ట్ మ్యాచ్, కాంపిటీషన్ ఇచ్చే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేనే..తప్పకుండా ఆమె పేరు రాబోయే రోజుల్లో నేషనల్ స్థాయిలో మరింత వినిపించబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: