బిగ్ బాస్9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లేనా.. ఊహించని వ్యక్తులకు ఛాన్స్ దక్కిందిగా?
అలేఖ్య చిట్టి పికెల్స్ ద్వారా పాపులర్ అయినా రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. ఈమె హౌస్ లోకి వస్తే బిగ్ బాస్ షోకు కూడా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. గోల్కొండ హైస్కూల్ సినిమాతో బాలనటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న శ్రీనివాస్ సాయి హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. శ్రీనివాస్ సాయి బిగ్ బాస్ హౌస్లోకి రానున్నాడని తెలుస్తోంది.
గృహలక్ష్మి సీరియల్ తో పాపులర్ అయిన నిఖిల్ నాయర్ పలుకే బంగారమాయేనా సీరియల్ లో సైతం నటించాడు. సీరియల్ ఫ్యాన్స్ ను బాగానే సంపాదించుకున్న ఈ నటుడు బిగ్ బాస్ షోతో తన ఇమేజ్ ను మరింత పెంచుకోవడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. గీత ఎల్ఎల్బీ సీరియల్ తో పాపులర్ ఆయన గౌరవ్ గుప్తా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
సావిత్రి గారి అబ్బాయి సీరియల్ తో పాపులర్ అయిన అయేషా జీనత్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారు. ఈమెకు తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం కూడా ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన దివ్వెల మాధురి కూడా బిగ్ బాస్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోలో కనిపిస్తే మాత్రం షో రేటింగ్స్ పరంగా సంచలనాలు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.