ప్రభాస్ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్.. ఆ సినిమాలకు సాయం చేసి గ్రేట్ అనిపించుకున్నాడుగా!
టాలీవుడ్ డార్లింగ్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలతోనే కాదు, చిన్న సినిమాలకు, మిడిల్ రేంజ్ సినిమాలకు అండగా నిలబడడంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 'బాహుబలి' సిరీస్ తర్వాత జాతీయ స్థాయిలో ప్రభాస్ సంపాదించుకున్న గుర్తింపు అపారం. ఈ గుర్తింపును, ఆయనకున్న స్టార్‌డమ్‌ను కేవలం తన సినిమాలకే పరిమితం చేయకుండా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు అండగా నిలబడడానికి ఉపయోగిస్తున్నారు.
ప్రభాస్ ఇచ్చిన చిన్న సహాయం వల్ల ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం విశేషం. ఈ మధ్య కాలంలో 'కన్నప్ప', 'మిరాయ్', 'కాంతార 1' వంటి చిత్రాలకు ప్రభాస్ తనవంతు తోడ్పాటును అందించారు. ఈ సినిమాలు అన్నీ విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఉదాహరణకు, 'కాంతార 1' సినిమాకు సంబంధించిన ప్రచారంలో పాలుపంచుకోవడం, 'కన్నప్ప' సినిమాలో గెస్ట్ రోల్ చేయడం తన వాయిస్ ఓవర్ ద్వారా 'మిరాయ్' వంటి చిత్రాలకు తన సోషల్ మీడియా వేదికగా ప్రచారం కల్పించడం వంటివి ప్రభాస్ చేశారు. ఈ సహాయం చిన్నదే కావచ్చు, కానీ ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియా స్టార్‌తో ఆయా చిత్రాల ప్రస్తావన రావడం వల్ల వాటికి దక్కిన బజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రభాస్ ఇచ్చిన ఈ 'టచ్' ఆయా సినిమాల విజయానికి ప్రధాన కారణమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అందుకే ఇప్పుడు నెటిజన్లు, సినీ వర్గాలు ప్రభాస్ హ్యాండ్‌ను 'గోల్డెన్ హ్యాండ్ గా అభివర్ణిస్తున్నారు. ఆయన ఏ సినిమాకు సాయం చేసినా అది తప్పక విజయవంతం అవుతుందనే నమ్మకం అందరిలోనూ పెరిగింది. కేవలం తన ఇమేజ్ గురించి కాకుండా, కొత్త టాలెంట్‌ను, మంచి కథాంశాలను ప్రోత్సహించే విషయంలో ప్రభాస్ చూపుతున్న ఈ ఔదార్యం, ఆయన గ్రేట్ అనిపించుకోవడానికి ప్రధాన కారణమైంది. ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా, చిన్న చిత్రాలకు సాయం చేసే విషయంలో ప్రభాస్ చూపించే ఈ నిబద్ధత నిజంగా అభినందనీయం.