ఆ పవర్ నాకు ఎప్పుడు వస్తుందో.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar

టాలీవుడ్ తెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కథానాయిక నిత్యామీనన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించే నిత్యామీనన్ ఇటీవల 'ఇడ్లీకొట్టు' సినిమాతో మళ్లీ మన ముందుకు వచ్చారు. నిత్యామీనన్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అభిరుచుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం' సినిమాలోని 'తార' పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని నిత్యా తెలిపారు. "ఆ పాత్ర చేసిన తర్వాతే నాలో తార పుట్టింది" అని ఆమె పేర్కొన్నారు.

రచయితల విషయానికి వస్తే, దేవదాస్ పట్నాయక్ రచనలు అంటే తనకు చాలా ఇష్టమని నిత్యామీనన్ చెప్పారు. జీవితంలో తను ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంటానని నిత్యామీనన్ స్పష్టం చేశారు. ఓపిక పడితే జీవితంలో అన్నీ కుదురుకుంటాయని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.

నటన గురించి మాట్లాడుతూ, నటన అనేది వ్యక్తిత్వానికి కొనసాగింపులాంటిది అని ఆమె అభిప్రాయపడ్డారు. నటించే సమయంలో స్పాంటేనియస్‌గా ఉంటూ, క్రియేటివిటీని చూపిస్తే ఆ పాత్రలు, నటన ఏళ్ల తరబడి ప్రేక్షకులకు గుర్తుంటాయని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు. ఖాళీ సమయాల్లో నిత్యామీనన్ తన స్నేహితుల నుంచి వచ్చిన ఉత్తరాలు చదువుతారట. ఒక్క టీ తాగితే తాను కూల్ అయిపోతానని ఆమె తెలిపారు. అంతేకాదు, నిత్యామీనన్‌కు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బాధగా ఉన్నప్పుడు స్వీట్స్ తింటే, ఆ బాధ కూడా లెక్కలోకి రాదని ఆమె సరదాగా చెప్పారు.

చిన్నపిల్లల్లా మాట్లాడటం అంటే నిత్యామీనన్‌కు చాలా ఇష్టమట. అందుకే చిన్నపిల్లల వాయిస్ ఓవర్ ఇవ్వమంటే ఇచ్చేస్తానని ఆమె పేర్కొన్నారు. తన కోరికల గురించి చెబుతూ, గాల్లో విహరించాలనే కోరిక తనకు ఉందని, ఆ శక్తి తనకొస్తే బాగుంటుందని నిత్యామీనన్ మనసులో మాట తెలిపారు. నిత్యా మీనన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: