కూలీని ఓటీటీలో చూడాలి అనుకుంటున్నారా.. అయితే ఆ తేదీ వరకు ఆగాల్సిందే..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించగా ... బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో నటించాడు. శృతి హాసన్ , సత్య రాజ్ , ఉపేంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనగరాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన అత్యంత భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.


భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కిన ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఇకపోతే చాలా మంది ఈ సినిమా ఎప్పుడు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తుందా ..? ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. తాజాగా ఈ మూవీ ఓ టి టి విడుదలకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.


అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీ నుండి తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూలీ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన ఈ మూవీ ఇప్పటివరకు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. మరికొన్ని రోజులు ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: