కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న విశాల్ రూమర్డ్ ప్రియురాలు.?
లక్ష్మీ మీనన్ గ్యాంగ్ ఆ ఐటీ ఉద్యోగి వెళ్లే వాహనాన్ని వెంబడించి బలవంతంగా కారులో నుండి లాక్కొని తమ కారులో ఎక్కించుకొని ఆ ఐటీ ఉద్యోగిని చితక్కొట్టడమే కాకుండా ఈ విషయం ఎక్కడైనా చెబితే బాగుండదు అని బెదిరించారట.అయితే దెబ్బలు తిన్న ఆ ఐటి ఉద్యోగి ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లక్ష్మీ మీనన్ తో పాటు ఆమె ఫ్రెండ్స్ మీద కేసు నమోదు చేశాడు. అలా ఆదివారం అర్ధరాత్రి 11:45 నిమిషాలకి నన్ను వాళ్లు కొట్టారంటూ గాయాలని కూడా చూపించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీ మీనన్ తో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు లక్ష్మి మీనన్ ఆచూకీ మాత్రం తెలియలేదు.
కొంత మంది లక్ష్మీ మీనన్ పరారీలో ఉంది అని కిడ్నాప్ కేసులో ఇరుక్కుంది అనే విషయం తెలియగానే ఆమె ఎక్కడికో పారిపోయింది అని అంటున్నారు. ఇక ఈ విషయం బయటపడడంతో చాలామంది నెటిజెన్లు లక్ష్మీ మీనన్ వ్యక్తిత్వాన్ని నిందిస్తున్నారు. ఇదేమైనా సినిమా అనుకుందా.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ కొట్టించడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లక్ష్మీ మీనన్ చివరిగా శబ్దం అనే సినిమాలో కనిపించింది. అయితే ఈ హీరోయిన్ ఇంద్రుడు సినిమాలో చేసిన సమయంలో విశాల్ తో ప్రేమలో ఉందని వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే రూమర్లు వినిపించాయి.