డ్రాగన్ టైటిల్‌తో ఎన్టీఆర్ మాస్ సంచలనం!
ముఖ్యంగా ఈ సినిమా బైలింగ్వల్ కాన్సెప్ట్‌లో ప్లాన్ అవుతోంది. వార్ 2తో హిందీలో ఎన్టీఆర్‌కు మంచి మార్కెట్ ఏర్పడింది. దాన్ని ఫాలో అవుతూ డ్రాగన్‌ను హిందీలో కూడా స్ట్రైట్ ఫిల్మ్‌లా తీస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఒక ఇంపార్టెంట్ రోల్‌ను హిందీలో ఒక స్టార్ చేస్తే, అదే రోల్‌ను సౌత్ వెర్షన్లో మరో తమిళ స్టార్ చేయనున్నారని టాక్. అంటే ఒక్క సినిమానే అయినా.. రెండు లాంగ్వేజెస్‌లో వేరే వేరే స్టార్స్‌తో డబుల్ క్రేజీ రాబోతుందన్నమాట. ఈ ఐడియా ఇండియన్ సినిమా హిస్టరీలోనే చాలా రేర్. అంతే కాదు .. రెండు ఇండస్ట్రీలకు చెందిన ఆడియన్స్‌కు ఒకే సినిమాపై కనెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసే ఆ స్టార్ ఎవరో అన్న సస్పెన్స్ కూడా క్రేజ్‌ను ఇంకా పెంచేస్తోంది.
ఇక హీరోయిన్ విషయంలో రుక్మిణి వసంత్ ను ఫైనలైజ్ చేశారు. ఎన్టీఆర్ – రుక్మిణి జంట కూడా స్క్రీన్‌పై ఫ్రెష్‌గా కనబడబోతోంది. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపైనే తమ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే దేవర, వార్ 2 సినిమాలు అంతగా సంతృప్తి లేకపోయినా.. డ్రాగన్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మాసివ్‌గా డిజైన్ అవుతోందని నమ్మకం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలకి ఇచ్చే మాస్ ఎలివేషన్స్‌కి ఇప్పటికే ఇండస్ట్రీ వణికింది. మరి మాస్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన ఎన్టీఆర్‌ను ఆయన ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశమే హద్దు. ఇక “డ్రాగన్” సినిమా రిలీజ్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం షేక్ అవ్వడం ఖాయం!