బోల్డ్ సినిమాల్లో నటించాక నా కెరియర్ పరిస్థితి అలా అయ్యింది.. తమన్నా..?

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె ఇప్పటివరకు ఎ న్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ల లో ఒక రిగా కెరియర్ను కొనసాగించింది. ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించడం కాకుండా అనేక తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటించింది. ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాల అవుతున్న ఇప్పటికి కూ డా మంచి అవకాశాలను దక్కించుకుంటూ మంచి దశలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. తమన్నా ఇప్పటివరకు ఎన్నో సినిమా ల్లో ఐటమ్ సాంగులలో నటించి తన అందాల తో , డ్యాన్స్ తో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 


ఈ మధ్య కాలంలో తమన్నా చాలా బోల్డ్ సినిమాల్లో కూడా నటించి అదిరిపోయే రేంజ్ లో తన అందాలతో ప్రేక్షకులకు కిక్ ఎక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా బోల్డ్ సినిమాల్లో నటించడం వల్ల తనకు ఎలాంటి క్రేజ్ వచ్చింది అనే దాని గురించి చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తమన్నా మాట్లాడుతూ ... కిస్ సన్నివేశాలు ఉన్న సినిమాల్లో అసలు నటించకూడదు అని కఠినమైన పాలసీ పెట్టుకోవడం వల్ల నేను కొన్ని సినిమా ఆఫర్లను కోల్పోయాను.


ఇక వాటన్నింటినీ పక్కన పెట్టి బోల్డ్ సినిమాల్లో మరియు గ్లామరస్ సన్నివేశాలు కలిగిన పాత్రలలో నటించడం మొదలు పెట్టాక నా కెరియర్ అద్భుతమైన రీతిలో టర్న్ అయింది అని తమన్నా తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కూడా తమన్నా అద్భుతమైన రీతిలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: