బాలయ్య గురించి వైరల్ అవుతున్న ఆ వార్త 100 కి 100% నిజమేనా..?
రజనీకాంత్ జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని ఈ మధ్యకాలంలో బాగా వార్తలు వినిపించాయి. బాలయ్య అభిమానులే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడా ఈ కాంబినేషన్ చూడాలని ఎదురుచూశాడు. ఇంతలో అవన్నీ పుకార్లే అంటూ కొన్ని వెబ్‌సైట్లు "జైలర్ 2లో బాలయ్య నటించడం లేదు" అని రాసేశాయి. దీంతో ఇది ఫేక్ న్యూస్ అని అనుకున్నారు. కానీ తాజాగా చెన్నై నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ వార్త నిజమేనని తేలింది. బాలకృష్ణ జైలర్ 2లో నటించడం ఖాయమని ఇన్సైడ్ వర్గాల నుంచి వార్త వచ్చింది. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య స్పెషల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అదీ ఆయనకు మరింత పేరు, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టే పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది.
సెట్లోకి బాలయ్య ఎంట్రీకి ఇంకా సమయం ఉందని, ఆయన పాత్ర కేవలం 20 నిమిషాలపాటు మాత్రమే కనిపించినా కథను మలుపు తిప్పేలా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్–బాలయ్య మధ్య ఉండే డైలాగ్ సీన్స్ అభిమానులను ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయబోతాయని కోలీవుడ్ నుంచి లీక్ అయిన వార్త. ప్రేక్షకులు "ఇంతకంటే కన్నుల పండుగ మరొకటి ఉండదు" అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ కాంబో కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ స్టార్స్ కూడా వేచి చూస్తున్నారు.