సినిమా ఇండస్ట్రీ లో ఓ మూవీ విడుదల తేదీ అనౌన్స్ అయ్యి ఆ మూవీ విడుదల తేదీ దగ్గర పడ్డాక ఆ సినిమా విడుదల పోస్ట్ పోన్ కావడం అనేది మనం అనేక సినిమాల విషయాలలో చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి పరిస్థితి రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ కొట్టిన ఓ హీరోకి కూడా వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను సాధించడం , అలాగే ఈయన ఎన్నో మూవీలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.
తేజ ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన ఆఖరుగా హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో తేజ క్రేజ్ భారీ ఎత్తున పెరిగిపోయింది.
ప్రస్తుతం తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన కాకుండా ఒక వారం గ్యాప్ తర్వాత సెప్టెంబర్ 12 వ తేదీన విడుదల చేసి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.