అతడు : రీ రిలీజ్ లో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..?
టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి అతడు మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా నైజాం ఏరియాలో 2.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 45 లక్షలు , ఆంధ్ర లో 1.90 కోట్లు , కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షలు , ఓవర్సీస్ లో 1.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ లో భాగంగా అతడు మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 6.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఇలా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా త్రిష హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో మహేష్ , త్రిష జోడీ కి మంచి ప్రశంసలు ప్రేక్షకుల , విమర్శకుల నుండి దక్కాయి.