కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రజిని ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రజనీ కాంత్ హీరో గా నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలాగే ఆయన నటించిన సినిమాలకు హిట్టు , ఫ్లాపు టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు వస్తూ ఉంటాయి.
అదే సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రజనీ కాంత్ "కూలీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... నాగార్జున ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. శృతి హాసన్ , సత్యరాజ్ , ఉపేంద్ర , ఆమిర్ ఖాన్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో నటించారు. ఆగస్టు 14 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది.
బుక్ మై షో ఆప్ లో ఈ మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు బుక్ మై షో ఆప్ లో కూలీ సినిమాకు సంబంధించిన 5 మిలియన్ టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇలా బుక్ మై షో ఆప్ లో కూలీ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు దీని ద్వారా క్లియర్ గా అర్థం అవుతుంది.