తెలుగులో కూలీ హవ ముగిసినట్లేనా.. ఆ విషయంలో కేవలం అన్నే రోజులు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా రజనీ కాంత్ "కూలీ" అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో నటించాడు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి అత్యంత భారీ అంచనాలు పెట్టుకున్నారు.


అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో విడుదల అయింది. అందులో భాగంగా తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అయింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నెగటివ్ టాక్ వచ్చింది. దానితో మొదటి రోజు ఈ సినిమాకు మంచి ఓపెనింగ్లు వచ్చిన ఆ తర్వాత కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి. ఇక ఏదేమైనా మొదటి నాలుగు రోజులు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.


ఇక ఐదవరోజు పర్వాలేదు అనే స్థాయిలో ఈ మూవీకి  రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వచ్చిన ఆరవ రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. కేవలం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు మాత్రమే ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కేవలం ఐదు రోజులు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టి ఆరవ రోజు ఒక కోటి కూడా షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టలేకపోవడంతో  ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: