సినిమా కార్మికుల సమ్మె.. రంగంలోకి చిరంజీవి.. ఆ విధంగా చెక్ పెట్టనున్నారా?
అయితే ఆ షరతులకు కార్మికులు ఒప్పుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎదురైంది. అయితే ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. కార్మిక వేతనాలు పెంచాలని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నామని చిరంజీవి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. 24 విభాగాల నుంచి 72 మందితో చిరంజీవి చర్చించారని ఆయన చెప్పుకొచ్చారు.
నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని వాళ్ళు చెప్పుకొచ్చారు. సాధ్యం కానీ, అమలు చేయలేని రూల్స్ పెడుతున్నారని తెలిపామని ఏదేమైనా మా కార్మికులతో పాటు నిర్మాతలు కూడా బాగుండాలని నిర్మాతల షరతులను పాటిస్తే మాత్రం మేము తీవ్రంగా నష్టపోతామని చెప్పుకొచ్చారు.
ఆదివారం డబుల్ కాల్ షీట్ గురించి కూడా చిరంజీవికి విన్నవించామని మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పాలని చిరంజీవి గారు అన్నారని ఛాంబర్ నుంచి మాకు కూడా పిలుపు వచ్చిందని చర్చలకు పిలిచారు కాబట్టి మేము ప్రస్తుతానికి నిరసన ఆపేస్తున్నామని చెప్పుకొచ్చారు. మేము అడిగినట్లు వేతనాల పెంపు వస్తుందని భావిస్తున్నామని అన్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు