కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన ఇండియన్స్ ఎక్కువ శాతం ఓ టి టి కంటెంట్ ను చూసేవారు కాదు. కానీ ప్రస్తుతం మన దేశ ప్రజలు ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ ను భారీ ఎత్తున చూస్తున్నారు. దానితో అనేక ఓ టి.టి ప్లాట్ ఫామ్ లు కూడా పుట్టుకొచ్చాయి. కానీ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ సంస్థలు కూడా ప్రతి సంవత్సరం కొన్ని సినిమాలనే కొంటూ రావడంతో కొన్ని సినిమాల ఓ టీ టీ హక్కులను ఎవరో కొనడం లేదు. కానీ కొన్ని క్రేజ్ ఉన్న సినిమాల ఓ టి టి హక్కులను మాత్రం సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కొన్ని ఓ టి టి సంస్థలు భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను ఎన్నింటినో అందుకొని తనకంటూ సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తలపతి విజయ్ "జన నాయగన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు.
ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉండగానే ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.