తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈయన వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడిగా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే భారీ మల్టీ స్టారర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా దర్శకుడిగా ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది.
ఇక ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ముకుంద , బ్రహ్మోత్సవం , పెదకాపు సినిమాలు వరుసగా భారీ అపజయాలను అందుకున్నాయి. దానితో దర్శకుడిగా ఈయన క్రేజ్ చాలా వరకు తగ్గింది. ఇది ఇలా ఉంటే పెదకాపు సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ శ్రీకాంత్ అడ్డాల తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్లు ఇంత వరకు రాలేదు. కానీ తాజాగా ఈయన ఒక యంగ్ హీరోతో మూవీ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు.
తాజాగా శ్రీకాంత్ అడ్డాల , కిరణ్ అబ్బవరం తో సినిమా చేసే ఉద్దేశంతో ఆయనకు ఓ కథను వినిపించినట్లు , శ్రీకాంత్ చెప్పిన కథ కిరణ్ కు బాగా నచ్చడంతో కిరణ్ కూడా శ్రీకాంత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో దగ్గుపాటి రానా అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజం గానే కిరణ్ , శ్రీకాంత్ కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యిందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.