సినిమా ఇండస్ట్రీ లో కొంత మందికి చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వారు ఆ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నట్లయితే అత్యంత తక్కువ కాలంలోనే వారు ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీ మణుల స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇకపోతే ఓ ముద్దుగుమ్మ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. ఆ సినిమాలు విడుదల అయ్యి మంచి విజయాలను సాధించినట్లయితే ఆమె క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది.
ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రుక్మిణి వసంత్. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తారక్ , ప్రశాంత్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా రుక్మిణి వసంత్ మరో అదిరిపోయే రేంజ్ పాన్ ఇండియా మూవీ లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కే జి ఎఫ్ నటుడు యాష్ "టాక్సిక్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రుక్మిణి వసంత్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు , ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాలో కీలక పాత్రను కోసం రుక్మిణి వసంత్ ను సంప్రదించగా ఆమె కూడా ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువలనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.