సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ సినిమా ఆగస్టు 14 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. రజనీ కాంత్ ఈ మూవీ లో హీరో గా నటించడం , టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ ఈమేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం , బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో చిన్న క్యామియో పాత్రలో కనిపించనుండడంతో లోకేష్ కనకగరాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను రాబట్టడం కష్టం అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమాకు ప్రస్తుతం మంచి కలక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్లు దక్కాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు.
ఆ పోస్టర్ ప్రకారం కూలీ మూవీ కి నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 5.9 మిలియన్ కలెక్షన్లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమా నార్త్ అమెరికాలో 6 మిలియన్ కలెక్షన్లను టచ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక నార్త్ అమెరికాలో ప్రస్తుతం టాప్ 3 లో జైలర్ , పొన్నియిన్ సెల్వన్ 1 ఇపుడు కూలీ సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది.