"కూలీ"కి కావాల్సింది ఇంకా అన్ని కోట్లు.. ఇకపై అసలు పరీక్ష మొదలుకానుంది..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కూలీ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఉపేంద్ర , సత్య రాజ్ , శృతి హాసన్ ముఖ్య పాత్రలలో నటించగా ... ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో చిన్న క్యామియో పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఎన్ని ..? ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూడు రోజులకు గాను ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31.93 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కగా ... 46.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే మరో 14.07 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది.

ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 162.65 కోట్ల షేర్ ... 321.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్గా నిలవాలి అంటే మరో 144.35 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్ట వలసి ఉంది.

ఇప్పటివరకు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రాబోయే మరి కొన్ని రోజులు ఈ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: