ప్రగ్యా జైస్వాల్.. ఈ గ్లామర్ డాల్ గురించి పరిచయాలు అక్కర్లేదు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన `కంచె` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రగ్యా.. ఆ తర్వాత `ఓం నమో వేంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయ జానకీ నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేమి అమ్మడి కెరీర్ కు ఉపయోగపడలేదు.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడటంతో ప్రగ్యా జైస్వాల్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. 2018 తర్వాత అవకాశాలు రాకపోవడంతో రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ కు దూరమైన ప్రగ్యా.. `అఖండ`తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో ప్రగ్యా జైస్వాల్ దశ తిరిగినట్లే అని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు.
అడపా దడపా అవకాశాలు మాత్రమే ప్రగ్యా తలుపు తడుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం ఈ అందాల భామకు మస్తు క్రేజ్ ఉంది. ఇన్‌స్టాలో ప్రగ్యాకు 27 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఈ బ్యూటీ భారీగా సంపాదిస్తోంది.
ఇక స్కిన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాలు ఆరబోయడంతో ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడో కంచె తెంచేసింది. మోడ్రన్ దుస్తుల్లో ఎప్పటికప్పుడు నెట్టింట సెగల పుట్టించే ప్రగ్యా.. తాజాగా రెడ్ కలర్ మినీ డ్రెస్‌లో గుంటూరు మిర్చిలా దర్శనమిచ్చింది.
ఓవైపు ఎద అందాలు, మరోవైపు థైస్ సోయగాలు చూపిస్తూ కుర్రకారు మతిపోగొట్టింది. ప్రగ్యా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటి చూసి ప్రగ్యా అందాల ఘాటును తట్టుకోవడం కష్టమే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు హాట్, ఫైర్ అని కామెంట్ల మోత మోగిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తెలుగులో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ఒకటి `అఖండ 2` కాగా.. మరొకరటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న `టైసన్ నాయుడు`. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.