కుబేర‌కు క‌న్న‌ప్ప గ‌ట్టిగానే దెబ్బ కొట్టేసిందే... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమా దగ్గర సినిమాలు థియేటర్లను హౌస్ పూల్స్ బోర్డులు పడేలా చేస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున , కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ - నేష‌న‌ల్ క్ర‌ష్మిక రష్మిక మందన్న కాంబినేషన్లో తెలుగు ద‌ర్శ‌ఖుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా కుబేర. ఈ సినిమా గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి థియేటర్లను కళకళలాడేలా చేస్తుంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న ఈ సినిమా అటు ఓవర్సీస్ లోను రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక రేపు మంచు విష్ణు నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా కన్నప్ప కూడా వస్తోంది. ఇది కూడా భారీ పాన్ ఇండియా సినిమా.


టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ తో పాటు పలు భాషలకు చెందిన సూపర్ స్టార్ హీరోలు ఈ సినిమాలలో నటించారు. అయితే కన్నప్ప సినిమా ఎఫెక్ట్ ఈ వారం కుబేర పై పడేలా ఉందని చెప్పాలి. చాలామందిని కన్నప్పను తక్కువగా అంచనా వేశారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో కన్నప్ప మంచి బుకింగ్స్ ఇప్పుడు నమోదు చేస్తోంది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ ల వరకు కన్నప్ప డే వన్ కి సైలెంట్ బుకింగ్స్ రిజిస్టర్ చేస్తుంది. రెండో వారంలో కూడా కుబేర బాగా పెర్ఫామ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే కన్నప్ప ఎఫెక్ట్ కుబేర పై ప్రస్తుతానికి అయితే గట్టిగా ఉందని చెప్పాలి. మరి కన్నప్ప సినిమాకు మంచి టాక్ వచ్చి నిలబడితే రెండు సినిమాలు బాగా రన్ అవుతాయి. ఏది ఏమైనా కన్నప్ప రిజల్ట్ వచ్చేవరకు కుబేర‌కు టెన్షన్ అయితే తప్పేలా లేదు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: