రాజమౌళి ఖాతాలో మరో భారీ రికార్డు .. వీడియో గేమ్ ప్రపంచంలో ప్రత్యక్షమైన దర్శక ధీరుడు..!?

Amruth kumar
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. బాహుబలి , త్రిబుల్ ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించిన రాజమౌళి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు .. అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్నా  ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌ నెలకుంది . ఇక ఈ సినిమాల్లో మహేష్ బాబు కూడా సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు .. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఎంతో సరవేగంగా జరుగుతుంది .. ఈ సినిమాలో గ్లోబ‌ల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ..
 

ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలను కూడా ప్రకటించనున్నారు చిత్ర యూనిట్ .. ఇక ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాజమౌళి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది .. ఓ జపనీస్ వీడియో గేమ్ లో  కనిపించి భారతీయ నటులకు ఎవ్వరికీ సాధ్యం కానీ అరుదైన ఘనత సాధించారు .. జపాన్లో తెలుగు సినిమాలకు భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే .. త్రిబుల్ ఆర్ సినిమాకు అక్కడ భారీ ఎత్తున ప్రమోట్ చేసిన రాజమౌళి  ఆ దేశంలో త్రిబుల్ ఆర్ సినిమాకు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది .. అయితే ఇప్పుడు జపనీస్ వీడియో గేమ్ సృృష్టికర్త హిడియో కోజిమా గతంలో రాజమౌళి కలవటం హాట్ టాపిక్ గా మారింది .


అలాగే ఆ సమయంలో అందరూ మహేష్ సినిమా కోసం ఆయనతో కలిసి పని చేయబోతున్నారా ? అన్న సందేహాలు కూడా వచ్చాయి .. ఇక ఇప్పుడు కోజిమా ఉమా క్రియేట్ చేసిన డెత్ స్టాండింగ్ 2  వీడియో గేమ్ లో రాజమౌళితో  పాటు ఆయన కొడుకు కార్తికేయ సైతం కనిపించారు .. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు .. ఈ ఒక్క వీడియో గేమ్ లో కనిపించి పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు రాజమౌళి .. వీడియో గేమ్ లో కనిపించిన భారతీయ తొలి సెలెబ్రిటీగా రికార్డ్ క్రియేట్ చేశారు .. ప్రస్తుతం ఈ వీడియో గేమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: