అల్లు అర్జున్ లేకుండానే ఐకాన్ .. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..?

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు .. డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా మూవీ తమ్ముడు .. జులై 4 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది .. అయితే ఈ సినిమా లో నితిన్‌ హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో నిర్మాత దిల్ రాజు ప‌లు ఆసక్తికర విషయాలు రివిల్ చేశారు .. అయితే దిల్ రాజు గతంలో ఐకాన్ అనే సినిమా ని దర్శకుడు వేణు శ్రీరామ్ తో ప్రకటించారు .. అలాగే ఈ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తారని కూడా ప్రకటనలు వచ్చాయి ..

 

అయితే ఈ మూవీ అప్పటికే మొదలవడం ఆలస్యం కావడం తో అల్లు అర్జున్ పుష్ప సినిమా లో బిజీగా మారిపోయాడు .. ఇక ఇప్పుడు ఐకాన్ సినిమా ను అల్లు అర్జున్ తో చేయటం ఇప్పుడు దాదాపు కుదిరేలా కనిపించడం లేదు .. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప‌లువురు కామెంట్లు చేయటం మొదలు పెట్టారు .. కానీ ఐకాన్ సినిమా కచ్చితం గా ఉంటుందని .. త్వరలో నే వేరే హీరో తో ఈ సినిమా ను మొదలు పెడతామని దిల్ రాజు ప్రకటించారు .. ఇక దీంతో ఇప్పుడు ఐకాన్ సినిమా లో ఎవరు హీరోగా నటిస్తారు అనేది అందరిలో ఆసక్తిగా మారింది ..



ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: