"భైరవం"కి భారీ షాక్ తగిలేలా ఉందే.. టార్గెట్ అంతా.. వచ్చింది ఇంత..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటులు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో తాజాగా భైరవం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ముగ్గురు హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా మే 30 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే పరవాలేదు అనే టాక్ వచ్చింది. దానితో మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లు దక్కాయి. మరి మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇంకా ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ లో అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 65 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 25 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 75 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.65 కోట్ల షేర్ ... 2.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. మొదటి రోజు ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 35 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల షేర్ ... 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 17 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 15 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: